చిలగడదుంప చ‌లికాలంలో తింటే ఏం అవుతుందో తెలుసా..?

-

చిలగడదుంప.. ఎంతో టేస్టీగా ఉండే ఇవి అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉండే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చిలగడదుంపలు బీటా-కెరోటిన్, విటమిన్ E, C, B-6, పొటాషియం, ఐరన్ తో నిండి ఉంటాయి. మామూలు దుంపల కంటే వీటిలో ఉండే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఉండే గ్లైకేమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల అది మధుమేహానికి తోడ్పడుతుందని ఈమధ్య వివరించబడింది. ఈ దుంపల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి చలికాలంలో తినడం వల్ల ఆ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఎందుకంటే విటమిన్ సి అనేది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరంచేస్తుంది. ముఖ్యంగా చిలగడదుంపల్లో అధికంగా పొటాషియం ఉండే గుణము ఉంది. ఇది గుండెకు చాల మేలు చేస్తుంది. ఎక్కువగా హార్ట్ బీట్‌ని సరి చేసేందుకు సాయపడుతుంది. చిలగడదుంప రసం ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దాంతో మెదడు ఆరోగ్యం బాగుంటుంది. చిలగడ దుంపలు మనసరీరానికి అవసరమైన మినరల్ ఐరన్ ని అధికంగా కలిగి ఉంటాయి. ఇవి కణాల సామర్ధ్యాన్ని పెంచి మన శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజెన్ ని సరఫరా చేస్తాయి. మన రోగనిరోధక వ్యవస్ధకు కు ముఖ్యభాగమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తి లో కూడా సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news