సాధారణంగా మనం ఇళ్లల్లో అనేక చెట్లని పెంచుతాము. అయితే వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టును ఇంట్లో పెంచకపోవడం మంచిది అని పండితులు అంటున్నారు. సాధారణంగా సీతా ఫలాల తో లక్ష్మీ పూజ చేయడం వల్ల దారిద్య్రం పోతుంది అని అంటారు. దారిద్య్రం తొలగి అష్టైశ్వర్యాలు కలగడానికి సీతాఫలం తో పూజలని చేస్తారు.
లక్ష్మీ కటాక్షం కలగడానికి సీతాఫలం తో పదార్ధాలని చేసి పూజిస్తే కలుగుతుందని పండితులు అంటున్నారు. ఇది ఇలా ఉంటె వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టును పెంచకపోతేనే మంచిదిట. ఒకవేళ మీ ఇంట్లోనే సీతాఫలం చెట్టు ఉన్నట్లయితే నరికేయకండి. అయితే దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే… సీతాఫలం చెట్టు పరిధిలో ఉసిరి లేదా అశోకా మొక్కల్ని కనుక మీరు పెంచితే దోష నివారణ పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేసారు.
సీతాఫలం అనేక ఆయుర్వేద మందుల లో కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కూడా ఇది ఎంత గానో మేలు చేస్తుంది. మీరు కనుక సీతాఫలాన్ని తీసుకున్నట్లయితే గుండె సంబంధిత సమస్యలు మీ దరి చేరవు. దీనిలో ఉండే గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. పిల్లల ఎముకల పుష్టికి ఔషధంలా సీతాఫలం పని చేస్తుంది. కనుక దొరికినప్పుడు సీతా ఫలాల్ని తినేయండి. అనేక సమస్యలకి సులువుగా చెక్ పెట్టేయండి.