పరగడుపున నెయ్యి తాగుతున్నారా? అదే మంచిదట!

-

వాతావరణం మార్పులు వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత మారుతుంటుంది. దీంతో జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు ఉందని పెరుగు బంద్ చేస్తారు. ఇక నెయ్యిని దరిచేరనివ్వరు. ఆరోగ్యం ఎలా ఉన్నా నిద్రలేవగానే కాఫీ మాత్రం బెడ్ పక్కన ఉండాల్సిందే. అసలు కాఫీ కంటే నెయ్యి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ఇంతకీ ఇది నిజమో కాదో తెలుసుకుందాం.

ఉదయం అలారం మోగగానే కాఫీ అంటూ కేకలు వేస్తుంటారు. కాఫీ చేతిలో పెడితే కాని కళ్లు తెరువరు. కాఫీ అలవాటు మంచిది కాదని చెప్పినా వినరు. నోట్లో కాఫీ పడగానే ఎక్కడా లేని ఉత్సాహం, ఆనందం వస్తుంది కొందరికి. ఇటీవలే ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే ఉదయాన్నే కాఫీకి బదులుగా నెయ్యి తాగడం వల్ల ఆరోగ్యంగాఎలాంటి ఢోకా ఉండదని, రోగాలను ధరిచేరనివ్వదని వెల్లడైంది. నెయ్యి శరీరంలోకి అంతేకదా! అని అన్నంలో కలుపుకొని తిన్నా రుచికి తప్ప అంతగా ప్రయోజనం ఉండదు.

ప్రయోజనాలు :
– ఉదయం లేవగానే బ్రష్ చేసి నెయ్యి కరగబెట్టాలి. చల్లారిన తర్వాత ఖాళీ కడుపుతో నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం ఉన్నవారికి ఆ సమస్య తీరిపోతుంది. ఏం తిన్నా గ్యాస్ ఫామ్ అయి ఇబ్బందిపెడుతున్నవారికి గ్యాస్, అసిడిటి నుంచి విముక్తి కలిగిస్తుంది.
– వయసు మీద పడిన వారు ఎక్కువగా అల్సర్‌తో బాధపడుతుంటారు. ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
– నెయ్యిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. తగిన మతాదులో తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తొలిగిస్తుంది.
– చిన్నపిల్లలు ఆటల్లో పడి అన్నం సంగతి మరిపోతుంటారు. ఆ సమయంలో ఆకలని కూడా అనిపించదు. దీంతో ఆహారం వైపు అంతగా మగ్గు చూపరు. నెయ్యి తాగించడం వల్ల ఆకలి పెరుగుతుంది.
– గర్భం దాల్చిన మహిళలు బిడ్డపై మమకారం పెంచుకుంటారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అలా ఉండాలంటే నెయ్యిని కచ్ఛితంగా తీసుకోవాలి. దీనిలోని ఎన్నో పోషకాలు పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు సాయపడుతుంది.
– రోజూ ఉదయాన్నే నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా ఉంటుంది. చర్మం, జుట్టు సమస్యలు తొలిగించి మగువలు అందంగా ఉండేలా చేస్తుంది.
– నెయ్యిలో కొవ్వుశాతం అధికంగా ఉంటుందని బరువు పెరుగుతారని చాలామంది ఆందోళన పడుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. నెయ్యిలో ఉండే కొవ్వుపదార్థాలు శరీరానికి మేలు చేసి బరువు తగ్గడంలో సాయపడుతుంది.
నెయ్యి తింటే ప్రయోజనాలు కదా అని మోతాదుకు మించి తింటే సమస్యలు ఎదుర్కోక తప్పదు. మితంగా తింటే అమృతం కూడా విషయంగా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news