తెలంగాణాలో లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఆసుపత్రులకు రావడానికి రోగులు జంకుతున్నారు. అయితే తెలంగాణా మొత్తం మీద కొన్ని ఆసుపత్రులలో ఓపీ సేవలు ప్రారంభించలేదు. తాజాగా గాంధీ, కింగ్ కోఠి, టీమ్స్ హాస్పిటల్స్ మినహ, మిగతా ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలు ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది.
కరోన కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆస్పత్రిల్లో సాధారణ ఓపి సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది వైద్య శాఖ. అలానే సర్కార్ ఆస్పత్రుల్లో క్వారంటైన్ సెలవులు రద్దు కూడా చేసింది. అయితే గాంధీ, కింగ్ కోఠి, టీమ్స్ ఆసుపత్రుల్లో యధావిధిగా క్వారంటైన్ సెలవులు ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే పలు హాస్పిటల్స్ లో కొద్దిరోజుల కిందట ఓపీ సేవలు ప్రారంభం కాగా మొదట్లో రోగులు వైద్య సేవల నిమిత్తం రావాలంటేనే వణికిపోయారు. కాని ఇటీవల కరోనా కేసులు నగరంలో తగ్గుముఖం పట్టడంతో రోజురోజుకూ ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్‌పేషెంట్ రోగుల సంఖ్య పెరుగుతోంది.