కరోనా టైమ్ లో సమాజమంతా నెగెటివిటీ తీవ్రంగా పెరిగింది. లాక్డౌన్ లో ఎవరూ ఇళ్ల నుండి బయటకి రాకుండా ఇంట్లోనే ఉంటూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గుండె మీద ఎక్కువ భారం పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ బాధ్యతలు మరింత చికాకుని పెంచడంతో పాటు గుండె మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇంట్లో ఉంటూ గుండెకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
దీనికోసం చేయాల్సిన కొన్ని విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.
ఏ వయస్సు గల వారైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళవద్దు. ముఖ్యమైన విషయం నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. చాలా మంది శరీరానికి కావాల్సినంత నీళ్ళని తాగకుండా గుండెజబ్బులని కొని తెచ్చుకుంటారు.
ఉదయం తొందరగా నిద్ర మేల్కోవడం, రాత్రి తొందరగా నిద్రపోవడం, వారంతాలు విశ్రాంతి తీసుకోవడం చేయాలి.
లాక్డౌన్ వల్ల కలిగే ఒత్తిడి కారణంగా ధూమపానం, మద్యపానం వంటివి ఎక్కువగా పెరిగాయి. ఇలాంటివాటికి దూరం ఉంటే గుండె జబ్బులు దూరంగా ఉంటాయి.
రోజూ వ్యాయామం చేయడం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేసుకోవడం అలవాటు చేసుకోండి.
ఎప్పుడూ ఒకే పనిచేస్తూ ఉండకండి. మనస్సును ఆహ్లాదపరిచే తోటపని, ఉల్లాస పరిచే పెయింటింగ్ గానీ ఏదైనా కళలో ప్రావీణ్యం సంపాదించడం గానీ నేర్చుకోండి. దీనివల్ల మనస్సుపై ఉన్న భారం తగ్గి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది.
ఎక్కువ సేపు ఒకేచోట కూర్చునే పనులు చేయవద్దు. మధ్య మధ్యలో కనీసం అరగంటకి ఒకసారైనా బ్రేక్ తీసుకోండి. మీ శరీరంలో ఏమైనా మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.