హైదరాబాద్ లోని ప్రముఖ డీమార్ట్ షాపింగ్ మాల్ మరియు ప్యారడైజ్ రెస్టారెంట్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తాజాగా డీమార్ట్ షాపింగ్ మాల్ మరియు ప్యారడైజ్ రెస్టా రెంట్లకు వినియోగదారుల పోరమ్ కోర్టు జరిమానా విధించింది. వినియోగ దారుల నుంచి బ్యాగుల కోసం ఛార్జ్ చేస్తున్నందుకు ప్రతి బ్రాంచీకి రూ. 50 వేల చోప్పున జరిమానా విధించింది వినియోగదారుల పోరమ్ కోర్టు. అటు ప్యారడైజ్ సికింద్రా బాద్ మరియు బేగంపేట… డీమార్ట్ బ్రాంచీలకు జరిమానా విధించింది.
అంతే కాదు.. ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి రూ. 4 వేల నష్ట పరిహారం మరియు కోర్టు ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల పోరమ్ కోర్టు తీర్పు చెప్పింది. కాగా… హైదరాబాద్ లోని డీమార్ట్ షాపింగ్ మాల్ లలో ఎక్కడికి వెళ్లినా… ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ అయ్యాయని చెప్పి… క్లాత్ బ్యాగ్స్ ఇస్తోంది. అయితే… వాటికి కూడా యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోంది. అటు ప్యారడైజ్ రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో వీటి యాజమాన్యాలు మారుతాయో? లేదో ? చూడాలి.