హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు.. వరద పోటెత్తింది. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో 6 క్రస్ట్ గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తే దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. అంతేకాకుండా.. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వచ్చే వరద స్థాయి ఒక్కసారిగా పెరిగింది. ఉస్మాన్ సాగర్ కు భారీ వరద చేరుకోవడంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేశారు.
ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 900 క్యూసెక్కులు కాగా హౌస్ లో 952 క్యూసెక్కులుగా ఉంది. ఇక హిమాయత్ సాగర్ కూడా భారీ వరద ప్రవాహం చేరుకుంటుంది. దీంతో అధికారులు జలాశయం యొక్క 2 గేట్లనే ఎత్తి నీటిని బయటికి వదులుతున్నారు. ప్రస్తుత నీటి సామర్థ్యం 2. 846 టీఎంసీలు కాగా జలాశయం ఇన్ఫ్లో 1200 క్యూసెక్కులు గా అవుట్ ఫ్లో 1373 గా నమోదయింది. నగరంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ప్రాజెక్టులలోకి వరద ఉధృతి పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు తెలుపుతున్నారు.