గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలోనే కాకుండా ఎగువనున్న రాష్ట్రాల్లో సైతం వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుంచి భారీ వరద నీరు వచ్చి ప్రాజెక్టు్ల్లో చేరుతోంది. అయితే.. ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోయింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణ మొదలైంది. జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. పవర్ హౌస్ నుంచి ఓవర్ ఫ్లో అవుతోంది. ఆ వరద నీరు కడెం గ్రామంలోకి చేరుతుండటంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.
ప్రాజెక్టు నుంచి వరద నీరు కిందకు దుంకుతుండటంతో నవాబు పేట్, అంబారి పేట్, దేవునిగూడెం, దాస్తురాబాద్, పెరకపల్లి, మున్యాల్, రేవోజి పేట్, మల్లాపూర్, కలమడుగు, మురిమడుగు, జన్నారం ప్రాంత ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఖానాపూర్ మండలం బావవూర్ చెరువుకు గండిపడటంతో కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి సురక్షిత ప్రాంతాలని తరలివెళ్లారు. ప్రాజెక్టు ఎడమకాలువ నిండుగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేశారు అధికారులు.