తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలే..!

-

తెలంగాణలో మరో రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

వర్షాకాలం ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా.. నిన్న మొన్నటి వరకు వానలు లేవు. దీంతో పంటలు వేసేందుకు అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు, మూడు రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో మరో రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉండడంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని.. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మట్టిరోడ్లు పూర్తిగా బురదమయమవడం, కొన్ని చోట్ల తారు రోడ్లకు బీటలు వారి కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో రాత్రి పూట చలి మరీ ఎక్కువగా ఉంటోంది..!

Read more RELATED
Recommended to you

Latest news