ఏపీకి భారీ వర్ష సూచన..ఆ ఐదు జిల్లాలకు అలర్ట్

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో రానున్న నాలుగైదు గంటలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. ఈ ఐదుజిల్లాల్లో అలర్ట్ గా ఉండాలని ఐఎండీ సూచించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.కోస్తా, రాయల సీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంద ని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.