ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీ కి భారీ వర్షాలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 06 అక్టోబర్ 2021నుండి వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమునకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దీని ప్రభావం తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది.


ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.