పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రేపటికీ వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి. సముద్రంలో భారీగా అలలు వస్తాయని.. మత్య్సకారుల వేట పై నిషేధం విధించారు.
ఎవ్వరూ వేటకు వెల్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ పేర్కొంది. అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశముంది. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.