ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఈ రోజు ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతములో కొనసాగుతుంది. ఈ అల్పపీడనంకి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తు వరకు కొనసాగుతుంది.
ఈ అల్పపీడనం కారణంగా.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలో అంటే.. కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, రూరల్ వరంగల్ , సిద్దిపేట, మెదక్, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.