బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..!

-

ఏపీ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆది, సోమవారాల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు, అనేక చోట్ల మోస్తరు వర్షాలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే తెలంగాణ విషయానికొస్తే.. పలు జిల్లాల్లో శనివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసాయని.. అలాగే అది, సోమవారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అదేవిధంగా సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news