BREAKING : తెలంగాణలో జాతీయ రహదారుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా.. ముంబై – హైదరాబాద్ జాతీయ రహదారి 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ ఉదయం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జాతీయ రహాదారుల వద్ద ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే.. అన్ని రహదారుల వద్ద ట్రాఫిక్ జామ్ అయింది.
యాసంగి లో పండిన కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే నన్న డిమాండ్ తో… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు టిఆర్ఎస్ పార్టీ ముట్టడించింది. విజయవాడ, బెంగ ళూరు, నాగపూర్, ముంబై నేషనల్ హైవే లో ముట్టడిం చాయి గులాబీ శ్రేణులు. అయితే.. ముంబై – హైదరాబాద్ జాతీయ రహదారి 65 పై పోలీసుల సూచన మేరకు ఆందోళన విరమించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రజాప్రతినిధులు. ఇది ఇలా ఉండగా.. ధాన్యం కోనుగోలు అంశంపై రాజ్యసభ లో నోటీసులు ఇచ్చింది టీఆర్‌ఎస్ పార్టీ.