ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

-

జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సోరెన్ చేత ప్రమాణం చేయించారు.మొదట జులై 7న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పినా.. ఆ తర్వాత తేదీని మార్చారు. గురువారం రోజున హేమంత్‌ సోరెన్‌ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత.. హేమంత్ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం చంపయీ సోరెన్, గవర్నర్ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. అనంతరం హేమంత్ సోరెన్, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు.

భూ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్న హేమంత్ సోరెన్ అరెస్టయి ఇటీవల జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాలకు సంబంధించిన భూ కుంభకోణం విషయంలో హేమంత్ సోరెన్పై ఆరోపణలు రాగా మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ కోసం సోరెన్‌ పలు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు. చివరకు ఆయనకు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అయిదు నెలల తర్వాత జూన్‌ 28న బిర్సా ముండా జైలు నుంచి సోరెన్ విడుదల అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news