ఇక్కడ ఏటీఎం నుంచి రేషన్ సరుకులు పొందొచ్చు ..!

-

రేషన్ ( Ration ) పంపిణీ విధానం లో కొత్త మార్పులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ తో ఒక రేషన్ కార్డు తో రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు అనే కార్యక్రమాన్ని తీసుకు రావడం కూడా జరిగింది.

 

atm ration | రేషన్
atm ration | రేషన్

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటికి వెళ్లి ప్రతి నెల నెలా రేషన్ ని పంపిణీ చేస్తోంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మరొక ఎత్తు. తాజాగా ఏటీఎం ద్వారా రేషన్ తీసుకునే విధంగా హర్యానా ప్రభుత్వం ఒక ప్రయత్నం మొదలు పెట్టింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానా ప్రభుత్వం తాజాగా ఏటీఎం ద్వారా రేషన్ తీసుకునే విధంగా ఒక విధానాన్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే దేశంలోనే తొలి ‘రేషన్​ ఏటీఎం’​ గుడ్​గావ్​లో పైలట్​ ప్రాజెక్ట్​ కింద ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దుష్యంత్​ చౌతాలా అన్నారు.

ఏటీఎం ద్వారా రేషన్ ని 5 నుండి 7 నిమిషాల్లో 70 కిలోల వరకు ధాన్యం విడుదలవుతుందని అన్నారు. ఎక్కువసేపు ఎదురు చూడడం లైన్లలో నిలబడడం లాంటివి చెయ్యక్కర్లేదు అని అన్నారు. ఇక నుండి గ్రెయిన్ ఏటీఎం ద్వారా వాటిని సరఫరా చేయనుందని తెలుస్తోంది.

తొలి రేషన్​ సరకుల ఏటీఎంను గుడ్​గావ్​లోని ఫరూక్​నగర్​లో ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. బ్యాంకు ఏటీఎం లానే రేషన్​ సరకుల ఏటీఎం వర్క్ అవుతుంది. దీనిలో బయోమెట్రిక్ కూడా వెయ్యాల్సి వుంది.

టచ్ ​స్క్రీన్​ ద్వారా లబ్ధిదారుడు ఆధార్​ లేదా రేషన్​ ఖాతా నెంబర్ ఇవ్వాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ జరగగానే ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్​గా సంచుల్లో మిషన్ ద్వారా నింపడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news