కారెక్కిన ఎల్‌. రమణ.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

కాసేపటి క్రితమే… టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి ఎల్‌. రమణను పార్టీలోకి ఆహ్మానించారు సీఎం కేసీఆర్‌. ఎల్‌. రమణతో పాటు పలుగురు పద్మశాలి నేతలు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎల్‌. రమణపై సీఎం కేసీఆర్‌ ప్రశంసలు కురించారు.

ఎల్‌. రమణ తనకు మంచి మిత్రుడని… ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్‌. రమణ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తారని వెల్లడించారు సీఎం కేసీఆర్‌. చేనేత కార్మికులకు భవిష్యత్తు లో ఆదుకుంటామని… చేనేత వర్గానికి కూడా రాజకీయ ప్రాధాన్యత కలిగించాలని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలని… త్వరలోనే చేనేత కార్మికులకు బీమా అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఒక చిన్న తప్పు కూడా జరగకుండా ఎజెండా రూపొందించుకుని ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.