5వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు : మంత్రి కేటీఆర్‌

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కొత్త రేషన్‌ కార్డులపై కీలక ప్రకటన చేశారు. పింఛన్ రాని వారందరికీ త్వరలోనే ఇస్తామని..5 వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతు బంధును చూసి కేంద్రం కిసాన్ పథకం మొదలు పెట్టిందని…జనాభాను బట్టి ప్రతి గ్రామ పంచాయతీకి డబ్బులు ఇస్తున్నామన్నారు. అవసరం ఐతే ఎమ్మెల్యే, మంత్రుల జీతాలు అపమని సీఎం కేసీఆర్‌ చెప్పారని…చెరువు చూస్తే కడుపు నిండీనంత సంతోషంగా ఉందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార మానేరు నిండిందని..తెలంగాణ వచ్చాకే అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. రెండోవ విడత 3 లక్షల.50 వేల యూనిట్లు గొర్రల యూనిట్లు త్వరలోనే ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ పశు సంపద రెట్టింపు అయ్యిందని… ఇది కేంద్రం చెప్తున్న మాట అని గుర్తు చేశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి అన్ని రకాల వసతులు కల్పించామని… తెలంగాణ వచ్చాక పింఛన్ 10 రేట్లు పెరిగిందన్నారు. 40 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news