విభజన చట్టం ప్రకారమే నీటి వాటా పంపిణీ : జల్ శక్తి శాఖ

-

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల జల వివాదంపై జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్తీ స్పందించారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను వివరించిన ఆయన… విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరుగుతుందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని… సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి ఉందని తెలిపారు.

water dispute | జల వివాదం
water dispute | జల వివాదం

అలాగే.. అక్టోబర్‌ 6న సీఎంలతో అపెక్ట్‌ కౌన్సిల్‌ సమావేశం ఉంటుందని స్పష్టం చేశారు. సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైందని.. కౌన్సిల్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. 2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ భాగస్వామ్యం, సహకారంతో ఎంతో కసరత్తు చేసి గెజిట్ తయారు చేసామని… కృష్ణ, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చామన్నారు.

అందులో ఆమోదించినవి, ఇంకా ఆమోదం పొందని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని… అప్రూవ్ కాని ప్రాజెక్ట్స్ గురించి సమగ్ర వివరణ ఇచ్చామని వెల్లడించారు. గెజిట్ లో ప్రస్తావించాం కాబట్టి, వాటికి ఆమోదం లభించింది అనుకోవద్దని…అదే విషయం ఇందులో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. షెడ్యూల్-1 లో అన్ని ప్రాజెక్ట్స్ పేర్కొనగా.. షెడ్యూల్-2 లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ బోర్డుల పరిధిలోనే ఉంటాయని వెల్లడించారు. షెడ్యూల్-3 లో ఉండే ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news