ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్ కి ఎంత డిమాండ్ పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా శానిటైజర్ వాడకం అనివార్యంగా మారిపోయింది. దీంతో అటు మార్కెట్లో కూడా శానిటైజర్ కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే అన్ని శానిటైజర్ లు మేలైనవి కావు అని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. అయితే మేలైన శానిటైజర్ అవునా కాదా అని తెలుసుకోవడం ఎలా అని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు.
ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల నాసిరకం శానిటైజర్ లు వచ్చిన నేపథ్యంలో.. వీటిలో చేతులకు అంటుకున్న వైరస్ అంతం చేయక కాకపోగా ఇంకా చేతులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాగా ఎంతో సులభంగా మీరు వాడే శానిటైజర్ నాణ్యమైనదా కాదా అని తెలుసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకొని శానిటైజర్ కలపాలి. ఒకవేళ గోధుమపిండి అతుక్కుపోతే అది నాణ్యమైన శానిటైజర్ కాదు అని అర్థం గోధుమపిండి పొడిగానే ఉంటే అది నాణ్యమైన శానిటైజర్ అని అర్థం అంటూ నిపుణులు సూచిస్తున్నారు.