తిరుపతిలో కరోనా బారినపడిన భార్యభార్తలు ఆస్పత్రికి బయలు దేరుతూనే గుండెపోటుతో చని పోయిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మదనపల్లెకి చెందిన భార్యభర్తలకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది. ముందుగా భార్య వెళ్లి అంబులెన్స్‌లో కూర్చుంది.
కానీ తాను ఆస్పత్రికి వెళ్లేది లేదని తనకు బాగుందని భీష్మించుకు కూర్చున్నాడు భర్త. దీంతో బంధువులు నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా అంబులెన్స్‌లో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అతనికి గుండెపోటు వచ్చి అంబులెన్స్ లోనే చని పోయాడు. కళ్లెదుటే భర్త చనిపోవడం జీర్ణించుకోలేకపోయిన భార్యకు కూడా గుండెపోటు వచ్చి చనిపోయింది. దీంతో ఈ ఘటన పలువురికి కంట తడి పెట్టిస్తోంది.