టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి సిఎం కెసీఆర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈటెల రాజేందర్ రాజీనామా అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును లోనూ చాలా వరకు మార్పు వచ్చింది. ఎప్పుడూ ప్రగతి భవన్ లో ఉండే సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తున్నారు.

మొన్నటి వరకు ఆసుపత్రుల పర్యటన చేసిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఫుల్ బిజీ అయిపోయారు. అలాగే ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ప్రజల సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్.

ఈ నెల 24న వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట టిఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజు రెడ్డి మృతి చెందారు. మద్యం లోనే సీఎం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ని పరామర్శించనున్నారు.