నాని ని నిరాశపరుస్తోన్న ప్రయోగాలు…!

-

ఎప్పుడూ ఒకే రకమైన క్యారెక్టర్స్ ప్లే చేస్తే ఆడియన్స్ మొనాటినీ ఫీల్ అవుతారు. అప్పుడప్పుడు ఎక్స్ పరిమెంట్స్ చేస్తేనే బెటర్ అని చెప్తారు సినీజనాలు. కానీ నాని మాత్రం ఎక్స్ పరిమెంట్స్ చేస్తే ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతున్నారు. కొంచెం డిఫరెంట్ గా కనిపించినా టిక్కెట్లు తెగట్లేదు. అంటే నేచురల్ స్టార్ సమ్ థింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కి సెట్ అవ్వట్లేదా?

ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఇంప్రెస్ చేసే నాని రూటు మార్చాలనుకుంటున్నాడు. రెగ్యులర్ ఫన్ లవింగ్ గయ్ క్యారెక్టర్స్ ని పక్కనపెట్టి, సమ్ థింగ్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ‘వి’ సినిమాలో అయితే సీరియల్ కిల్లర్ గా యాక్ట్ చేశాడు. రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. కానీ ఇంత ఛేంజ్ ని తీసుకోలేకపోయారు ప్రేక్షకులు. దీంతో ‘వి’సినిమాకి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.నాని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా చేసిన ‘గ్యాంగ్ లీడర్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. పెన్సిల్ అనే రచయిత పాత్ర పోషించిన నాని, రివేంజ్ డ్రామాతో నవ్వించడానికి ప్రయత్నించాడు. కానీ నేచురల్ స్టార్ ప్రయత్నాలు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో ఈ సినిమా కూడా నెగటివ్ టాక్ తోనే ఇంటికెళ్లిపోయింది.

నాని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నుంచి బ్రేక్ తీసుకుని చేసిన ప్రయోగాత్మక చిత్రాలు రెండూ బోల్తాపడ్డంతో ఈ హీరోకి ఎక్స్ పరిమెంట్స్ కలిసిరాట్లేదనే ప్రచారం జరుగుతోంది. నేచురల్ స్టార్ మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథల్లో నటిస్తే బెటర్ అనే టాక్ వస్తోంది. మరి నాని ఈ రిజల్ట్స్ తో ఎక్స్ పరిమెంట్స్ ని పక్కనపెట్టేస్తాడా.. లేక ఆడియన్స్ ని థ్రిల్ చెయ్యడానికి మరో డామ్ షూర్ ఎక్స్ పరిమెంట్ కి రెడీ అవుతాడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news