కార్తికేయ హీరో నిఖిల్​కు ఉత్తమ నటుడిగా ‘ఐకానిక్ గోల్డ్’ అవార్డు

-

కార్తికేయ 2 సినిమాతో టాలీవుడ్​తో పాటు పాన్ ఇండియా రేంజ్​లో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లలోనూ దూసుకుపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.121 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్‌లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా ఓ అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. కార్తికేయ చిత్రానికి గాను ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డును నిఖిల్​ అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నిఖిల్​.. సోషల్​ మీడియాలో పంచుకున్నారు. బ్యాక్​గ్రౌండ్​లో ‘హే కేశవ.. హే మాధవ.. హే గోవిందా’ పాటను జోడించి పోస్ట్​ చేశారు. అయితే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్​.. నిఖిల్​కు అభినందనులు చెబుతున్నారు.

కార్తికేయ సిరీస్‌లో మూడో భాగం ఉంటుందా? అని నిఖిల్​ను ప్రశ్నించగా, ‘కచ్చితంగా ఉంటుంది. సాహసాలను, సమస్యలను , మిస్టరీలను ఛేదించే ఉత్సాహం ఉన్న డాక్టర్‌ కార్తీక్‌ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. మన దేశ సంస్కృతిలో ఎవరికీ తెలియని ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని భాగాలతో మీ ముందుకు వస్తాం’ అని నిఖిల్‌ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news