విడాకులపై క్లారిటీ ఇస్తూ అసలు విషయం చెప్పిన హీరో శ్రీకాంత్..!

-

హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ సహా నటి ఊహను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.. ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో తాజాగా అలజడలు ఏర్పడ్డాయని.. శ్రీకాంత్ , ఊహ విడిపోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇకపోతే దాదాపు ఇప్పటికే 125 కు పైగా సినిమాలలో హీరోగా నటించిన ఈయన.. మరొకవైపు విలన్ గా తన సత్తా చాటి.. శ్రీకాంత్ అంటే ఏంటో ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో చూపించారు. మరొకవైపు సినిమాలలో అప్పట్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే సహా నటి అయిన ఊహతో పరిచయం ఏర్పడింది. ఇక వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఒకరికొకరు నచ్చడంతో అప్పట్లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

అలా కొంతకాలానికి రోషన్ , మేధ, రోహన్ అనే ముగ్గురు పిల్లలు జన్మించారు. పెద్దకొడుకు రోషన్ గురించి మనకు తెలిసిందే.. హీరోగా నిర్మలా కాన్వెంట్ సినిమాతో పాటు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి శ్రీకాంత్ , ఊహ మధ్య విడాకులు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో అసలు విషయం తెలియక అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు తన భార్యతో విడాకుల పై హీరో శ్రీకాంత్ స్పందిస్తూ అసలు విషయం తెలియజేశారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ..” ప్రస్తుతం నేను, నా భార్య షూటింగ్లో బిజీగా ఉన్నాము. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.. అయితే ఈ వార్తల్లో అసలు నిజం లేదు. ఇవన్నీ పుకార్లే అంటూ ఆ వార్తలను కొట్టి పారేశారు ” శ్రీకాంత్. మొత్తానికైతే శ్రీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు ఫేక్ అని స్పష్టం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news