బిగ్ బాస్ పై హాట్ కామెంట్స్ చేసిన తరుణ్..!

-

టాలీవుడ్ యువ హీరో తరుణ్ బిగ్ బాస్ 4లోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై తరుణ్ స్పందించారు. తాను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఈ షోలోకి రాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధమే అని, దయచేసి వీటిని నమ్మొద్దని తరుణ్ పేర్కొన్నారు. ఈ మేరకు తరుణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసాడు. ఆ తప్పుడు వార్తలను మీరు నమ్మొద్దు.

అలాగే జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి. మీ అందరి ప్రేమ, మద్దతుకి ధన్యవాదాలు’ అని బిగ్ బాస్ వార్తలను ఖండించాడు. మరి మిగతా వారు కూడా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ వార్తలు సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నాయి. బిగ్‌బాస్ నాల్గొ సీజన్‌పై గత కొన్ని రోజులుగా నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news