ఖరీదైన కారు కొన్న హీరో విశ్వక్ సెన్..తరుణ్ భాస్కర్ ఫన్నీ కౌంటర్

-

విశ్వక్ సెన్ తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అత్యంత ఖరీదైన కారుని కొని తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకుముందే విశ్వక్ సెన్ రేంజ్ రోవర్ కారును కొనేశాడు. అయితే ఇప్పుడు తాజాగా బెంజ్ కారు ని కొనేశాడు. బెంజ్ కారు లో టాప్ అండ్ లేటెస్ట్ మోడల్ ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 మోడల్ కొనేశాడు. దీని ధర కనిష్టంగా 2.5 కోట్ల నుంచి గరిష్టంగా మూడు కోట్ల వరకు ఉంది.

మొత్తానికి విశ్వక్ సెన్ తన రేంజ్ ఏంటో.. బెంజ్ కద ఏంటో అందరికీ చూపించేశాడు. ఇక విశ్వక్ సెన్ చేసిన ఈ పోస్ట్ మీద సెలబ్రిటీలు సరదా కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ అయితే కౌంటర్ వేశాడు.” ఆ కారు నాదే ఫోటోలు దిగుతానంటే ఇచ్చా “అని కౌంటర్ వేశాడు తరుణ్. అలీ రెజా అయితే కంగ్రాట్స్ అని కామెంట్ పెట్టేశాడు. ఇక విశ్వక్ సెన్ ఫ్యాన్స్ అయితే పార్టీ ఏది అన్నా అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ మంచి జోరుమీద ఉన్నాడు. వరుస సినిమాలకు సైన్ చేసి బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో మంచి హిట్ కొట్టేశాడు.

https://www.instagram.com/p/Cdr9JzcpHxr/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news