BREAKING : ఆసుపత్రిలో చేరిన హీరోయిన్ సమంత?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లోని ఏ ఐ జి.. ఆస్పత్రిలో లో సమంత చేరినట్లు తెలుస్తోంది. నిన్న తిరుపతికి వెళ్లిన సమంత… అక్కడి వాతావరణానికి కాస్త అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే హెల్త్ చెకప్ కోసం ఆమె హైదరాబాద్ లోని ఏ ఐ జి హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం అందుతోంది.

అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. మరికాసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సమంత నటించిన పుష్ప ఐటమ్ సాంగ్ పై ఇవాళ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. పురుషుల మనోభావాలను ఆ సాంగ్ లిరిక్స్ దెబ్బతీశారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

Read more RELATED
Recommended to you

Latest news