బీజేపీ టెన్షన్ : ప్రగతి భవన్, తెలంగాణా భవన్ ల వద్ద భారీగా పోలీసులు

రేపు దుబ్బాక ఉపఎన్నిక సంధర్భంగా హైదరాబాద్ లో భారీ కుట్రకు బీజేపీ తెరతీసిందని నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించి దుబ్బాకలో సింపతి ఓట్లు పొందే కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో బీజెపి ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధం అవుతున్నారని లాఠీ ఛార్జి, లేదంటే ఫైరింగ్ జరిగేలా బిజెపి ప్లాన్ చేస్తోందని అయన నిన్న డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు.

police
police

ఈ క్రమంలో ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి ఉండవచ్చని వార్తలు వస్తోన్న నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. తెలంగాణా భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ముందు జాగ్రత్తగానే ప్రగతి భవన్, తెలంగాణ భవన్ వద్ద భద్రతని డబుల్ చేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ అంతా హై అలెర్ట్ లో ఉంచినట్టు అయ్యింది.