ఉస్మానియా ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ అడిగిన హై కోర్టు.. ఎందుకు అంటారు..?

-

ఉస్మానియా ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఉస్మానియా పురాతన భవనం కూల్చవద్దని న్యాయవాదులు వాదనలు వినిపించారు. భవనం కూల్చకుండా పక్కనే భవనం నిర్మించవచ్చని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన న్యాయస్థానం ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి వాయిదా వేసింది. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. దాన్ని కూల్చివేసి నూతన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీన్ని కొందరు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పురాతన భవనాన్ని కూల్చవద్దని.. ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, శ్రీనివాస్ పిల్​పై హైకోర్టులో విచారణ చేపట్టారు. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచన చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం పరిధిలో విచారణ జరపాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. రెండు రాష్ట్రాల జలవివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుందని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లతో చర్చించి చెబుతామని న్యాయవాది శ్రవణ్ తెలిపారు. తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news