కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని విఆర్ఏ లు తమ ఉద్యోగాల కోసం ప్రభుత్వంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే . అయితే కొత్తగా పంచాయితీరాజ్ శాఖ పరిధిలో వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లను విఆర్ఏ లకు కేటాయించడానికి ప్రభుత్వం చట్టాలను తీసుకువచ్చింది. కానీ ఈ చట్టాలకు విరుద్ధంగా రెవెన్యూ విభాగానికి చెందిన కొందరు సబార్డినేట్లు హై కోర్ట్ లో ఫిల్ వేశారు. ఈ విఆర్ఏ లను జూనియర్ అసిస్టెంట్ లుగా నియమించిననున్న జీవో లను వెంటనే రద్దు చేయాలనీ కోర్ట్ కెక్కారు. దీనిపై హై కోర్ట్ వారు కోరిన విధంగానే ఈ చట్టాలపై స్టే విధించింది. పైగా ప్రభుత్వం విఆర్ఏ లను ఇతర శాఖల్లో ఇస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన చట్టాలను రద్దు చేసింది. అయితే ఈ ఊహించని కోర్ట్ తీర్పుకు విఆర్ఏ లు మరో పిటిషన్ ను వేశారు..
మాకు ముందున్న విధంగానే ఉద్యోగాలు వచ్చేలా చేయాలని పిటిషన్ వేయగా, దీనిపై మాత్రం కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. చట్టాలను సస్పెండ్ చేయడంతో కేసీఆర్ సర్కారుకు తీరని భంగపాటు కలిగింది అని చెప్పాలి.