జగన్ సర్కార్ కు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ ఉద్యోగుల జీతాలపై హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ అంశంపై ఇవాళ ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది. ఐఆర్, HRA అడ్జస్ట్మెంట్ చేస్తామన్న ప్రభుత్వ ఉత్తర్వులపై ఈ సందర్భంగా ఏపీ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్, HRA ఎడ్జస్ట్మెంటుని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జీతాల్లో రికవరీ అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమన్న హైకోర్టు… సమ్మె ప్రజాస్వామ్య సూత్రాల్లో ఉన్న హక్కు అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. అలాగే ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది హై కోర్టు. ఇది ఇలా ఉండగా.. పాత పీఆర్సీ ప్రకారమే.. తమ జీతాలు చెల్లించాలని ఏపీ ఉద్యో గులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.