మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి వినతీ పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ గా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
గతంలో హైకోర్టు ఆదేశాలు రాగానే వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ… తర్వాత ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత వెంటనే గవర్నర్ ను కలిసి తన వ్యవహారం తేల్చాలని నిమ్మగడ్డ ప్రయత్నించే అవకాశముంది. అయితే గవర్నర్ ఇందుకు ఒప్పుకోకపోతే నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చని తెలుస్తోంది.