వర్మ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

-

వివాదాస్పద దర్శకుడు వర్మ కు హైకోర్టు షాకిచ్చింది.  దిశ ఎన్ కౌంటర్ సినిమాకి సంబంధించి రాం గోపాల్ వర్మకు హైకోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దిశ ఎన్ కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని హైకోర్టును నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణ మూర్తి తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాని నిర్మించి వారిని ఊరిలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని కృష్ణ మూర్తి పేర్కొన్నారు.

Ram Gopal Varma
Ram Gopal Varma

ఈ సినిమాలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అందుకే సినిమా విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దిశ సంఘటన పై ఒక పక్క జ్యుడీషియల్ కమిషన్ విచారణ జరుగుతున్నా ఇలా సినిమా ఎలా తీస్తారని కోర్టుకు గుర్తు చేశారు కృష్ణమూర్తి. వెంటనే సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ కు కూడా హైకోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news