బిజినెస్ ఐడియా: ఇటుకల వ్యాపారంతో అదిరే లాభాలు.. ఎలా అంటే..?

-

చాలామంది వ్యాపారాలను చేస్తూ ఉంటారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఇటుకుల బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు. ఇటుకల బిజినెస్ ద్వారా లక్షల్లో డబ్బులు సంపాదించడానికి అవుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు షాపింగ్ కాంప్లెక్స్లు వంటివి ఎక్కువైపోతున్నాయి.

ఇటువంటి వాటిని కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇటుకలు తప్పక అవసరం. కాబట్టి దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. అయితే మరి ఇటుకల బిజినెస్ ఎలా చేయాలి..? కావాల్సినవి ఏమిటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ బిజినెస్ చేయడానికి మీకు వంద గజాల స్థలం కావాలి. అలానే పెట్టుబడి కింద రెండు లక్షల రూపాయలు అవసరం అవుతాయి.

ఈ వ్యాపారాన్ని కనుక స్టార్ట్ చేస్తే లక్ష రూపాయలు వరకు ప్రతి నెల సంపాదించుకోవచ్చు. ఇటుకలు తయారు చేయడానికి బూడిద, సిమెంట్ కావాలి. ఒక మిషన్ ని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం చేయడానికి కేవలం 100 గజాలు ఉంటే సరిపోతుంది. ఎక్కువ అక్కర్లేదు. అలానే మీరు కొంత మంది వర్కర్లను నియమించుకోవాల్సి ఉంటుంది.

మిషన్ ఖరీదు 12 లక్షల వరకు ఉంటుంది రోజూ ఈజీగా 3000 ఇటుకలను మిషన్ తయారు చేసేస్తుంది. ఆటోమేటిక్ మిషన్ అయితే బాగుంటుంది. మీ దగ్గర ఉండే డబ్బులు బట్టి మీరు మీరు చూసుకోండి. ఆటోమేటిక్ మిషన్ అయితే ఒక గంటలో వెయ్యి ఇటుకులను తయారు చేయగలదు. ఇలా మీరు పెట్టుబడి పెట్టుకొని నెమ్మదిగా ఈ వ్యాపారంని సాగిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు ఈ వ్యాపారానికి డిమాండ్ ఎక్కువ. పైగా రిస్క్ కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news