కెసిఆర్ – కేఏ పాల్ పొత్తు పెట్టుకుంటారేమో – బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బుధవారం చేసిన ప్రకటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాలలోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని తెలిపారు. కానీ భారత రాష్ట్ర సమితి అంటే అర్థం ఏమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రకటించిన పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ కొత్త పార్టీ పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు.

టిఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు నాడు పార్టీలో ఉన్న వాళ్లలో ప్రస్తుతం ఎంతమంది ఇంకా అదే పార్టీలో కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. బుధవారం టిఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో ఏ ఒక్కరు కూడా సంతోషంగా కూర్చోలేదని అన్నారు. దేశ రాజకీయాలలో విమానం కొన్న వాళ్లు ఇద్దరే ఇద్దరు ఉన్నారన్న బండి సంజయ్.. వారిలో ఒకరు కేఏ పాల్ కాగా.. మరొకరు కెసిఆర్ అని తెలిపారు. విమానం కొన్న వీరు ఇద్దరు భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news