ఏపీ తెలంగాణ మధ్య ముదిరిన వివాదం : నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత

-

ఏపీ- తెలంగాణల మధ్య ఉన్న జల సమస్య ఇప్పుడు విద్యుత్ వివాదంగా మారింది. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఏపీ అధికారులు.. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ తెలంగాణ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులను సరిహద్దు వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

నాగార్జునసాగర్ లోకి ఏపీ అధికారులను పంపేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. అటు ఏపీ అధికారుల వినతి పత్రాన్ని తీసుకునేందుకు తెలంగాణ జెన్కో అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్టు ఇరువైపుల ఏపీ మరియు తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు. అలాగే పులిచింతల దగ్గర ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలు కూడా నిలిపివేశారు. ప్రస్తుతం పులిచింతల పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news