ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రసంగంతో అసెంబ్లీలో నిరసనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు నోర్లు మూయించినట్లు అయింది. అసలు ఆంధ్ర అనే పదం ఎలా వచ్చింది అన్న విషయం గురించి మాట్లాడుతూ అది తెలుగువారికి సంబంధించిందని బ్రిటిష్ ప్రభుత్వం లోనే రుజువైందని తెలిపారు. శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబడ్డాయని కృష్ణ మరియు గోదావరి జిల్లాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములని శివరామకృష్ణ కమిటీ తేల్చింది అని చెప్పారు.
అలాగే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములను రియల్ ఎస్టేట్ చేయకూడదని అప్పట్లోనే శివరామకృష్ణ కమిటీ పేర్కొందని వికేంద్రీకరణ చాలా అవసరమని కూడా తేల్చిందని ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాల్సి ఉందని బుగ్గన స్పీచ్ లో తెలిపారు. అంతేకాకుండా అమరావతి భూమి గురించి మాట్లాడుతూ భారత దేశంలోని మూడు పంటలు పండే భూమి అమరావతి అని అటువంటి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే అమరావతిని ఆ ప్రాంత భూమిని నాశనం చేయకూడదు అని అప్పట్లోనే తెలిపినట్లు శివరామకృష్ణ కమిటీ గురించి చెప్పుకొచ్చారు బుగ్గన.
ప్రస్తుతం ప్రభుత్వం అంతటా అభివృద్ధి జరగాలని నిర్ణయాలు తీసుకుంటుందని సమన్యాయం గా అభివృద్ధి జరగాలని నిర్ణయాలు తీసుకుంటున్నామని ఇదే విషయాన్ని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బట్టి చూస్తే వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అసెంబ్లీలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు వైయస్ జగన్ అని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు.