ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తానం ముగిసింది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ గా చెన్నై ఆడింది. అయితే ఈసారి జట్టులో కొందరు ఆటగాళ్ళ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధానంగా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా ఆట తీరుపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. సిఎస్కెలో రూ .6.75 కోట్ల భారీ రేటుతో జట్టులోకి వచ్చిన పియూష్ చావ్లా నుంచి చాలా ఆశించారు.
హర్భజన్ సింగ్ లేకపోవడంతో అతనికి ప్రధాన పాత్ర లభించింది. కాని పియూష్ ఏడు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసాడు. 9.09 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. ఏడు మ్యాచులకు దూరంగా ఉన్నాడు. అయితే చెన్నై పిచ్ కోసం అతన్ని కొనుగోలు చేయగా మ్యాచ్ లు దుబాయ్ లో జరిగాయి. దీనితో ఒక్కసారిగా అంచనాలు అన్నీ తల కిందులు అయ్యాయి.