విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ ను సమర్థిస్తూ నిన్న కర్ణాటక హైకోర్ట్ కీలక తీర్పును చెప్పింది. అయితే ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ముస్లిం మహిళ విద్యార్థినిల తరుపున నిబా నాజ్ అనే ముస్లిం విద్యార్థి తరపున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
తాజాగా ఈ వివాదం సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చింది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరుపున న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు. త్వరలో పరీక్షలు ఉన్న నేపథ్యంలో తక్షణమే విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణకు సుప్రీం కోర్ట్ నో చెప్పింది. సెలవుల తరువాతే కేసు విచారణ చేపడుతామని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీనిపై తమకు కొంత సమయం కావాలని వ్యాఖ్యానించారు.
హిజాబ్ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్ట్ కీలక తీర్పును ఇచ్చింది. ఇస్లాం మతంలో హిజాబ్ అనేది తప్పనిసరి ఆచారం కాదంటూ వ్యాఖ్యానించింది. విద్యాసంస్థల్లో హిాజాబ్ బ్యాన్ ను సమర్థించింది. విద్యాలయాలకు స్కూల్ యూనిఫామ్ లోని రావాలంటూ.. స్ఫష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించడం లేదని తీర్పు చెప్పింది.