బలవంతంగా హిజ్రాని చేశారంటూ వీడియో కాల్ మాట్లాడుతూ సూసైడ్ !

-

తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీడియో కాల్ మాట్లాడుతూనే ఒక హిజ్రా ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల మండలం నక్కల బండ తండాకు చెందిన శ్రీకాంత్ తనను బలవంతంగా హిజ్రాగా మార్చారని బంధువులకు వీడియో కాల్ లో చెప్పి ఆ వీడియో కాల్ లో బంధువులు అందరూ చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను హిజ్రాగా మార్చడానికి వెనక జడ్చర్లకు చెందిన ముగ్గురు హిజ్రాల పాత్ర ఉందని, ఇప్పటికీ తను వారి చెరలోనే ఉన్నాను అని వెల్లడించాడు.

ఈ ఘటనకు సంబంధించి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. నక్కలగుట్ట తండాకు చెందిన శ్రీకాంత్ కి 18 ఏళ్లు. అతని తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గరే పెరిగాడు. అయితే ఏడాది క్రితం శ్రీకాంత్ అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ దొరకలేదు. అలాంటిది ఈ నెల నాలుగో తేదీన రాత్రి 9 గంటల సమయంలో అదే తండాలో ఉంటున్న మేనమామ కొడుకు వినోద్ కు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేశాడు.

 

తాను ప్రస్తుతం కడపలో ఉన్నానని, కొందరు నన్ను బలవంతంగా హిజ్రాగా మార్చారని అలాగే నా పేరు శ్రీలేఖ గా మార్చారు అని చెప్పుకొచ్చాడు. కడపలో ఉంటున్న ఒక యువకుడిని ప్రేమించానని కానీ అతను మోసం చేసి వేరే వివాహం చేసుకున్నాడు కాబట్టి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెబుతూ లైవ్ లో నే పురుగుల మందు తాగాడు. వెంటనే వారు లోకల్ లీడర్లు సహాయంతో పోలీసులను ఆశ్రయించగా వారు కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news