‘విక్రమ్‌ – వేద’ ట్రైలర్‌ రిలీజ్… హృతిక్‌- సైఫ్‌ యాక్షన్‌ అదుర్స్

-


హృతిక్ రోష‌న్.. సైఫ్ ఆలీఖాన్‌తో కలిసి న‌టించిన చిత్రం ‘విక్ర‌మ్ వేద’. ఈ మూవీ విడుద‌లకు సిద్ధంగా ఉంది. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘విక్ర‌మ్ వేద’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది

ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన పుష్క‌ర్‌- గాయ‌త్రి హందీ రీమేక్‌ను కూడా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

లేటెస్ట్‌గా విడుద‌లైన విక్ర‌మ్ వేద ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. విక్ర‌మ్‌, భేతాలుడు క‌థ‌లను బేస్ చేసుకుని తెర‌కెక్కించిన ఈ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాలో హృతిక్ గ్యాంగ్‌స్టార్‌గా న‌టించగా.. సైఫ్ ఆలీఖాన్ పోలీస్ ఆఫిస‌ర్‌గా న‌టించాడు. ఇక హృతిక్‌, సైఫ్‌ తుపాకులు చేతబట్టి యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. హృతిక్‌, సైఫ్‌ల మధ్య వచ్చే పోరాట ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఈ రీమేక్ చిత్రాన్ని గ్రాండియ‌ర్‌గా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రిల‌య‌న్స్ ఎంట‌ర్టైన‌మెంట్స్‌, టీ-సిరిస్ ఫిలింస్‌, ఫ్రైడే ఫిలిం వ‌ర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్‌కు జోడీగా రాధికా ఆప్టే న‌టించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news