‘షా’తో చరిత్ర.. బండికి సాధ్యమేనా?

-

ఓ వైపు మూడో సారి అధికారం దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్..మరోవైపు ఈ సారైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్…అసలు ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ…ఇలా మూడు పార్టీలు అధికారమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నాయి…ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులతో ముందుకొస్తున్నాయి….ఎవరికి వారు పై చేయి సాధించాలని చూస్తున్నారు.

అయితే ప్రస్తుతానికి టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీదే పై చేయిగా కనిపిస్తోంది…కానీ అధికార బలం వల్లే కారు పార్టీకి బలం కనిపిస్తోంది..ఇక ఆ అధికార బలాన్ని తగ్గించి ప్రజా బలం పెంచుకుని కారుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ చూస్తుంది. అయితే కాంగ్రెస్, కారుకు కూడా చెక్ పెట్టేసి సత్తా చాటాలని కమలం చూస్తుంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం కమలానికి బాగా అడ్వాంటేజ్ గా మారింది…అందుకే ఏడాది కాలం నుంచి కమలం దూకుడుగా రాజకీయం చేస్తుంది…అలాగే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది..కారుతో ఢీ అంటే ఢీ అనేలా బండి పోరాడుతున్నారు…పైగా ఉపఎన్నికల్లో గెలవడం కమలానికి పెద్ద అడ్వాంటేజ్.

ఇక అదే ఊపుతో అధికారం దక్కించుకోవాలని ముందుకెళుతుంది..రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పి బండి గట్టిగా కష్టపడుతున్నారు…తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకెళుతున్నారు…ఇప్పుడు తన పాదయాత్రతో దూసుకెళుతున్నారు…ఇప్పటికే రెండో విడత పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది..ఇక ఈ ముగింపుని కమలానికి కొత్త ఊపు వచ్చేయాలని చూస్తున్నారు. అందుకే ఈ నెల 14న ముగింపు సభకు అమిత్ షాని తీసుకొచ్చి చరిత్ర సృష్టించాలని బండి భావిస్తున్నారు.

ఇటీవలే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి భారీ సభ నిర్వహించి సక్సెస్ అయ్యారు. ఇక అదే రూట్ లో అమిత్ షాని తీసుకొచ్చి భారీ స్థాయిలో సభ పెట్టి చరిత్ర సృష్టించాలని బండి అనుకుంటున్నారు…ఈ సభతో కాంగ్రెస్-కారుకు చెక్ పెట్టేయాలని చూస్తున్నారు. మరి చూడాలి బండి చరిత్ర సృష్టిస్తారో లేదో..

Read more RELATED
Recommended to you

Latest news