హిట్‌2 షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న అడవి శేష్‌

-

మేజర్‌ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను అలరించారు హీరో అడవి శేష్. తన నెక్స్ట్ సినిమా హిట్- ద సెకండ్ కేసు గురించి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శేష్ ఆ సినిమా అప్‌డేట్ ఇస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. హిట్-2 సినిమా షూటింగ్ నుంచి కొన్నిరోజులు బ్రేక్ తీసుకుంటున్నట్లు శేష్ ట్విటర్ ద్వారా తెలిపారు. మేజర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో భాగంగా ఇన్నిరోజులు బిజీబిజీగా గడిపిన తాను.. కాస్త అలసిపోయానని అందుకే బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు.

‘మేజర్ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికి థ్యాంక్స్. మేజర్ తర్వాత వెంటనే హిట్-2 తో మీ అందర్ని ఎంటర్‌టైన్‌ చేద్దామనుకున్నాను. కానీ వీరసైనికుడైన మేజర్ ఉన్నికృష్ణన్ కథను, జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో ఇన్ని రోజులు బిజీగా గడిపాను. అందుకే కాస్త అలసిపోయాను. సినిమా ప్రొడ్యూసర్ నాని, డాక్టర్ శైలేష్ గారిని కొన్ని రోజులు బ్రేక్ కావాలని అడిగాను. దానికి వాళ్లు ఒప్పుకున్నారు. కొన్నిరోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ హిట్-2 షూటింగ్ మొదలుపెడతాం. హిట్-2 కి సంబంధించిన అప్​డేట్స్‌తో మళ్లీ త్వరలోనే మీ ముందుకు వస్తాను. మేజర్ సినిమాలాగే హిట్‌-2ను ఆదరించడానికి రెడీగా ఉండండి.’ అని అడవి శేష్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news