ఆ మంత్రులు రాజీనామా చేయాలి: మంత్రి అనురాగ్ ఠాకూర్

-

అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఢిల్లీలో గతేడాది నవంబర్ 17 నుంచి అమలు చేస్తున్న వివాదాస్పద ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరిపింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు మేరకు విచారణ జరిపింది. ఈ విచారణలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరు కూడా ఉందని సమాచారం. ఈ విషయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. మీలాంటి అవినీతిపరులకు అధికారంలో ఉండే హక్కు లేదని ఆరోపించారు.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

అలాగే కేంద్ర దర్యాప్తు బృందాలతో ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్ స్పందించారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోసం కేంద్ర హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేసిన సిఫార్సుపై అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఆరోపణ చేశారు. అంతే దీని అర్థం వీళ్లు కూడా అవినీతి పాల్పడుతున్నట్లేనా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి ప్రవేశించేముందు అవినీతి నిర్మూలనపై కేజ్రీవాల్ ఎన్నో మాటలు చెప్పారు. అవినీతి మంత్రులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందేనని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news