నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మల్లు స్వరాజ్యం కి సంతాపం ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డిలకు సంతాపం తెలుపుతూ.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది సభ. అనంతరం సభను 12వ తేదీకి వాయిదా వేశారు. అయితే సభ ఆరు నిమిషాలే నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
అసెంబ్లీ 20 రోజులు నడపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే.. కేవలం రెండు రోజులు మాత్రమే పెడతామన్నారని అన్నారు. డీఎస్సీలో కూడా మా మాట వినడం లేదన్నారు. చట్టసభలలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలన్నారు బట్టి. వరదలు, రైతు కష్టాలు, నీట మునిగిన ప్రాజెక్టులు, పోడు భూములు, నిరుద్యోగ సమస్యపై డిస్కస్ జరగాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హక్కులపై డిమాండ్ చేస్తున్నామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనపై ఎందుకు ఆంక్షలు విధించారని ప్రశ్నించారు భట్టి. గురుకుల పాఠశాలల్లో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని.. అన్ని సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు.