హైదరాబాద్ నగరంలో రెండ్రోజులుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోందని… ఇతర మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని తెలిపారు.
ఎమ్మెల్యే రాజా సింగ్‌పై హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయన్నా ఆయన… చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చట్టానికి జాతి, మత, కుల, వర్గ ఇతర భేదాలు ఉండవని… చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని స్పష్టం చేశారు.
ప్రజలు వారి వారి మతాలకు, కులాలకు, ఆచారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. మతాలకు వ్యతిరేకంగా ఎలాంటి అవాస్తవాలను, తక్కువ చేసి మాట్లాడడం వంటివి చేస్తే సహించమని తెలిపారు. ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అందరూ సంయమనంతో, సోదరభావంతో ఉండాలని కోరారు.