బలపరీక్షలో నెగ్గిన నితీశ్.. విపక్షాల ఐక్యతకు పిలుపు

-

బిహార్ లో బీజేపీకి గుడ్ బై చెప్పి మహాగట్ బంధన్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి మహేశ్వర్ హజారీ ప్రత్యక్ష ఓటింగ్ నిర్వహించారు. 243మంది సభ్యులుగల బిహార్‌ శాసనసభలో 160 ఓట్లతో నీతీశ్‌ సర్కార్ విజయం సాధించారు. బలపరీక్ష అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి తెలిపారు. ఖాళీ అయిన స్పీకర్ స్థానానికి గురువారం నామినేషన్లు తీసుకోనునన్నట్లు పేర్కొన్నారు.

ఎల్​జేపీ నేత చిరాగ్ పాస్‌వాన్ తిరుగుబాటును నితీశ్ పరోక్షంగా ప్రస్తావించారు. భాజపా ఆదేశాలతో ఆర్సీపీ సింగ్.. జేడీయూలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని పదవి కోసమే మహాగట్‌ బంధన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న భాజపా ఆరోపణలను ఖండించిన నీతీశ్‌.. తనకు వ్యక్తిగత ఆశయాలు లేవని వ్యాఖ్యానించారు.

అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికలకు ఐక్యం కావాలని దేశంలోని అన్నిపార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో భాజపాతో తన పాత బంధాన్ని గుర్తుచేసుకున్న నీతీశ్‌.. వాజ్‌పేయి, అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషికి.. ప్రస్తుత కమలదళం అధినాయకత్వానికి ఉన్న తేడాను నొక్కిచెప్పారు. ప్రస్తుత పాలనలో ప్రచారం తప్ప పాలన చాలా తక్కువ అని ప్రధాని పేరు ప్రస్తావించకుండా నీతీశ్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news