నన్ను కూడా ట్రోల్ చేస్తున్నారు.. ఇదేనా టిడిపి సంస్కృతి : హోం మంత్రి వనిత

-

టి.డి.పి.కి మహిళలపై గౌరవం లేదని.. అత్యాచార బాధితురాలి పరామర్శను చంద్రబాబు రాజకీయం చేశారని ఫైర్ అయ్యారు హోం మంత్రి తానేటి వనిత. మూడు గంటల్లో నిందితులను పట్టుకున్నాం, బాధితురాలికి పది లక్షల పరిహారం ఇచ్చామన్నారు. నన్ను ట్రోల్ చేయడం మాహిళలకు ఇచ్చే గౌరవమా ? మహిళా కమిషన్ ఛైర్మన్ తో టి.డి.పి మహిళలు కుళాయి దగ్గర కొట్లాలా వ్యవహరించారని ఫైర్ అయ్యారు.

వనజాక్షిని కొడితే నాటి సి.ఎం చంద్రబాబు పంచాయతీ చేశారని.. మహిళలు సి.ఎం జగన్ కు అండగా ఉన్నారని టి.డి.పి ఫ్రస్ట్రేషన్ అని అగ్రహించారు. ప్రతి అవకాశాన్ని రాజకీయం చేస్తున్నారని.. గత ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కాదని చెప్పారన్నారు.

మా ప్రభుత్వంపై నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారని.. అందుకే మా ప్రభుత్వంలో అత్యాచార కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించారు. దిశ యాప్ ద్వారా ఇప్పటికి 900 మంది మహిళలు తమని తాము రక్షించుకున్నారని.. హక్కుల కోసం పోరాడటాన్ని ముఖ్యమంత్రి హర్షిస్తారన్నారు. సి.ఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యు.టి.ఎఫ్ యత్నించడం సరైనదేనా ? అని ప్రశ్నించారు తానేటి వనిత.

Read more RELATED
Recommended to you

Latest news